కోనసీమ: ఈ నెల 31న ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్లో బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను శాఖలవారీగా అప్పగించారు.