KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ పరిసరాల్లో వజ్రాల కోసం ప్రజలు వేతుకులాట మొదలు పెట్టారు. ఏటా అక్కడ వర్షాలు కురిసిన మరుసటి రోజు వజ్రాలు లభిస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. కాగా, జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి, చెన్నంపల్లి, బసినేపల్లి గ్రామ పొలాల్లో గతంలో వజ్రాలు లభించినట్లు ఆధారాలు ఉన్నాయి.