శేఖర్ ఏ కథనైనా కన్విన్సింగ్‌గా చెప్పగలడు. అది నిర్మాతల ధైర్యం. అందుకే 150 కోట్లకి రిస్క్ చేశారు ఏషియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్, శ్రీ వేంకటేశ్వర ఎల్ఎల్పి అధినేత పుస్కూరు రామ్మోహనరావు కంబైన్డ్‌గా. నాగార్జునకి ప్రస్తుతం పెద్ద మార్కెట్ లేకపోయినా, ధనుష్ మార్కెట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర ఇప్పుడు పరిశ్రమలో సూపర్ హాట్ టాపిక్ అయింది. రెండుమూడు రోజుల క్రితం విడుదలైన కుబేర టీజర్ ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ వైబ్సే క్రియేట్ చేసింది. ఇంత వరకూ ఎవ్వరూ చేయని ఓ ప్రయోగం చేశాడు శేఖర్ కమ్ముల. రిథిమిక్ ప్రోజ్ వర్స్ ప్లే చేసి మొత్తం టీజర్‌ని రక్తి కట్టించాడు. పాటలతోనో, మాంటేజ్ హమ్మింగ్స్తోనో, డైలాగులు, యాక్షన్ బిట్లు, ఛేజ్‌లతో ఆ రెండు నిమిషాలో, మూడు నిమిషాలో టీజర్ టైంని కాస్త తినేస్తారు. అందులో ఏదో ఒక చిన్నబిట్ హిట్ అయితే ఓమని చంకలు గుద్దుకుంటారు. ఇదీ మామ్మూలుగా జరిగే తంతు. చిన్ని సినిమాకైనా ఇంతే. పెద్ద సినిమాకైనా ఇంతే.
కానీ కుబేర టీజర్ ఇందుకు పూర్తిగా భిన్నంగా, విభిన్నంగా ఉంది. టీజర్లో ఫస్టాఫ్‌లో నాగార్జున ఎక్కువసేపు ఉన్నారు. సెకండాప్ మొత్తం ధనుష్. ఇలా పంచేశాడు శేఖర్. ధనుష్ డేట్స్ ఉన్నకారణంగా ధనుష్‌కి సరిపోయే కథ కాదు గానీ, ప్రపంచసినిమాలో కామన్ హిట్ ఫార్ములా, పేదవాడు ధనవంతుడు, కుబేరుడు ఎలా అయ్యాడు అనే కథాంశంతో శేఖర్ గడుసుగా తప్పించుకున్నాడు. శేఖర్ ఏ కథనైనా కన్విన్సింగ్‌గా చెప్పగలడు. అది నిర్మాతల ధైర్యం. అందుకే 150 కోట్లకి రిస్క్ చేశారు ఏషియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్, శ్రీ వేంకటేశ్వర ఎల్ఎల్పి అధినేత పుస్కూరు రామ్మోహనరావు కంబైన్డ్‌గా. నాగార్జునకి ప్రస్తుతం పెద్ద మార్కెట్ లేకపోయినా, ధనుష్ మార్కెట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పైగా పాన్ ఇండియా. ఇందులో నిర్మాతలు సీరియస్ రిస్క్ ఫీలవలేదు.
సంగీత దర్శకుడు డిఎస్పీకే పదికోట్లకు పైగా ముట్టచెప్పారు నిర్మాతలు. అంటే సినిమా రేంజ్‌ని నిర్మాతలు ఏ రేంజ్‌లోకి తీసుకెళ్ళారో తెలుస్తుంది.నాగార్జునకి ప్రస్తుతం పెద్దగా డిమాండ్ లేకపోయినా సరే, క్యారెక్టర్ కోసం శేఖర్ కమ్ముల ఎంపిక చేసుకున్నారని టీం చెబుతున్నారు. ఇంక ధనుష్ గురించి చెప్పనక్కర్లేదు. బ్రహ్మాండమైన ట్రెండింగ్‌లో ఉన్నాడు. హిట్స్ పరంగా గానీ, క్రేజ్ పరంగా గానీ. సినిమా హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి కథకి శేఖర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏడ్ అయితే చాలా నావెల్‌గా ఉంటుంది. టీజర్లో అదే కనిపిస్తోంది.
జూన్ 20న విడుదలవడానికి సర్వసన్నాహాలు శరవేగంతో జరుగుతున్న ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో కుబేర ఎటువంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ కొడితే అందరి పంట పండినట్టే. ఎంతో నమ్మకంతో అంత బడ్జెట్‌తో కుస్తీకి బరిలోకి దిగుతున్న నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు జాక్‌పాట్ కొట్టినట్టే. నాగార్జునకి ఇది నిజమైన అవకాశం హిట్ పడిందంటే త్వరలో ప్రారంభం కాబోతూన్న 100వ చిత్రానికి జేగంటలు మోగినట్టే.