కృష్ణా: విజయవాడ విద్యాధరపురం డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి APSRTC ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా డిపోలో సుమారు 15 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం 100 ఈవీ బస్సులను మంజూరు చేయగా, మొత్తం వ్యయం రూ.4.66 కోట్లు అయ్యింది.