సందీప్ వంగా చేస్తున్న స్పిరిట్ చిత్రంలో కల్కి యాక్ట్రస్ దీపిక పడుకొనేని ఎంపిక చేసుకుని కథ చెప్పడం జరిగింది. ఈ బాలీవుడ్ అమ్మడు డిమాండ్ల బాణాలు సంధించడం మొదలుపెట్టింది. అవి తనకి సెట్ కాక, సందీప్ యానిమల్‌లో సెకండ్ క్యారెక్టర్ చేసిన తృప్తిని ఫైనల్ చేసుకున్నాడు. అక్కడితో అయిపోయిందనుకున్నాడు మన తెలుగు అమాయకుడు. కానీ, ఈ ఉత్తరాది ఉల్క ఊరుకోలేదు.
స్టార్స్ డిమాండ్‌లో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్టు డిమాండ్ చేయడం రెగ్యులరే. అందులో పెద్ద వింతా, విడ్డూరమూ కొత్తగా ఏమీ లేవు. ఉండవు కూడా. కానీ ఆ డిమాండ్లను నిర్మాతలు మీట్ అవగలరా లేదా అన్నదే పాయంట్ దేనికైనా ముందైతే కథ చెప్పాలి హీరోకైనా, హీరోయిన్‌కైనా. అప్పుడింక హీరోయిన్ల పైశాచిక డిమాండ్లు మొదలవుతాయి. డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ కూడా సెట్ అవకపోతే ఎవరి మట్టుకు ఊరుకుంటారు. వేరే ఆఫ్షన్ చూసుకుంటారు. ఇదీ షరామామ్మూలే.
ఉదాహరణకి బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన పాత్రకి ముందు శ్రీదేవి అనుకున్నారు దర్శకుడు రాజమౌళి. అ మేరకు శ్రీదేవి కథ చెప్పారు. ఆమెకు నచ్చింది కథ. రాజమౌళి ట్రాక్ రికార్డు కూడా శ్రీదేవిని ఇంప్రెస్ చేసిన మాట వాస్తవం. కానీ శ్రీదేవికున్న సూపర్ స్టార్డమ్ కారణంగా తాను అడగాల్సినవి ఏవో డిమాండ్ చేసింది. కానీ, రాజమౌళి ఆలోచించుకుని, ఇంతైతే తన సినిమా బడ్జెట్ తట్టుకోలేదని శ్రీదేవి ఐడియాని విరమించుకుని రమ్యకృష్ణని కేస్ట్ చేసుకున్నారు. శ్రీదేవి అప్పుడేం ఆరోపించలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎవరికి వారు కామ్‌గా పనిచేసుకున్నారు.
కానీ ఇప్పుడు సందీప్ వంగా చేస్తున్న స్పిరిట్ చిత్రంలో కల్కి యాక్ట్రస్ దీపిక పడుకొనేని ఎంపిక చేసుకుని కథ చెప్పడం జరిగింది. ఈ బాలీవుడ్ అమ్మడు డిమాండ్ల బాణాలు సంధించడం మొదలుపెట్టింది. అవి తనకి సెట్ కాక, సందీప్ యానిమల్‌లో సెకండ్ క్యారెక్టర్ చేసిన తృప్తిని ఫైనల్ చేసుకున్నాడు. అక్కడితో అయిపోయిందనుకున్నాడు మన తెలుగు అమాయకుడు. కానీ, ఈ ఉత్తరాది ఉల్క ఊరుకోలేదు. ఉరిమింది. తన పిఆర్ టీం ద్వారా స్పిరిట్ కథమీద బురద జల్లడం మొదలు పెట్టింది. ఇది పచ్చి బూతు లేదా వయొలెన్స్ కలసి ఏ రేటెడ్ ఫిల్మ్ అని ఊకదంపుడు ప్రచారం చేయించింది. ఆమె చెప్పకుండా పిఆర్ టీం ఎందుకు పనిలోకి దిగుతారు? సందీప్ షాక్ అయ్యాడు. ఇదేంటీ గొడవ అనుకున్నాడు. ఇంక శ్రుతి మించిపోతోందని అనుకుని, ఒక్క ట్వీట్ చేశాడు. అందులో కూడా దీపికను సందీప్ ఏమీ దూషించలేదు. ద్వేషంతో దంచలేదు. కథ గురించి అలా మాట్లాడడం తప్పు కదా, ఓ యంగ్ హీరోయిన్ కెరీర్‌ని డౌన్ చేయడమే కదా, ఇదేనా స్త్రీత్వం అంటే అని ప్రశ్నించాడు. ఓ దర్శకనిర్మాతగా తానెంత కమిటెడ్, ఎంత డెడికేటెడ్ అనేది మాత్రమే కోట్ చేశాడు.
దానికే ఇంక బాలీవుడ్ సర్కిల్స్ పక్షపాతంతో సందీప్ మీద విరుచుకుపడుతున్నారు. దక్షిణాది దర్శకులు, వాళ్ళ సినిమాల వైభవం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న బాలీవుడ్ సోషల్ మీడియా, తగుదున్నమా అంటూ ఖాళీగా కూర్చున్న స్త్రీవాద శక్తులు ఏకమై, సందీప్ వంగా మీద తోక తొక్కుతున్నారు.
అయితే ఇందులో ప్రధానమైన ప్రశ్నేంటంటే, వాస్తవానికి సందీప్ వంగా ఒకవేళ దీపిక అడిగిన డిమాండ్లను గనక ఓకే అంటే ఈ ఎ రేటెడ్ సినిమాకి ఆమె రెడీయేనా? అడిగినవన్నీ ఇచ్చేస్తే, ఎలా చెయ్యమంటే అలా చేయడానికి సిద్ధమేనా? అప్పుడు కథలో బూతున్నా, పెచ్చుమీరిన వయొలెన్స్ ఉన్నా దీపిక అంతా భరించడానికి నిశ్చయమేనా? ఇప్పుడిది కొత్తగా చర్చకొస్తోంది. మరి అప్పుడు దీపిక బుద్ది ఏమైందని కొందరు హేతుబద్దంగా మాట్లాడేవాళ్ళు అడుగుతున్నారు. దీపిక నోరు దీనికి పెగలడం లేదు.