రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్ నిర్వహించనుంది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూలో మాక్ డ్రిల్ జరపనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కాగా, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇటీవల కూడా కేంద్రం పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే.