NTR: నందిగామ ఎస్సై అభిమన్యు దాతృత్వాన్ని చాటుకున్నాడు. కంచికచర్ల మండలం పరిధిలోని గొట్టముక్కల గ్రామానికి చెందిన చర్మకారుడు కంచికచర్లలోని నెహ్రూ సెంటర్లో ప్రతిరోజు చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తాడు. చెప్పులు కొట్టుకునేందుకు వీలుగా రూ.6 వేలు గల చెక్క బల్ల (పీఠ)ను వెంకయ్యకు మంగళవారం అందజేశారు. ఎస్సై మానవత్వంపై పట్టణ ప్రజలు హర్షణ వ్యక్తం చేశారు.