E.G: కడియం మండలానికి చెందిన రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గెడ్డం పృథ్వీరాజ్ తన కుమార్తె ఓణీ ఫంక్షన్ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికను వినూత్న రీతిలో ముద్రించాడు. కూటమి ప్రభుత్వం జారీ చేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డు తరహాలో ఆహ్వాన పత్రికను ముద్రించారు. అంతే కాకుండా పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అహ్వనపత్రిక అందజేశారు. మంత్రి ఆయనను అభినందించారు.