RR: షాద్‌నగర్‌లో రైతులకు 50% సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువులు అందించనున్నట్లు ఏడీఏ నిశాంత్ కుమార్ తెలిపారు. కేశంపేట్ రోడ్‌లోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం-2లో పట్టా పాస్‌బుక్‌తో సంప్రదించి 30 కేజీల బ్యాగ్‌కు రూ.2137.50 చెల్లించి తీసుకోవాలన్నారు. షాబాద్‌లో 75 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను 50% సబ్సిడీతో పంపిణీ చేయనున్నట్లు అధికారి వెంకటేశం తెలిపారు.