KKD: కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఇతర ఏర్పాట్ల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడలో మంగళవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు, హాకీ స్టేడియం అభివృద్ధి పనులపై జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, R&B ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.