NRML: రానున్న నాలుగు రోజులు నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, తెగిన విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 6305646600ను సంప్రదించాలన్నారు.