BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెంలోని తానా కాలనీలో సర్వే నంబర్ 461/1-Aలో ఉన్న దాదాపు రెండు ఎకరాల అసైన్డ్ భూమిలో వేసిన అక్రమ లేఅవుట్ను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. లేఔట్ చుట్టూ పాతిన సరిహద్దు రాళ్ళను పీకేసి వేటపాలెం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.