GNTR: పహల్గామ్ ఘటన అనంతరం మతసామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై తాడేపల్లిలో ఆదివారం సమైక్యత యాత్ర జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ.. ఈ ఘటనను బీజేపీ, సంఘ పరివార్ స్వార్థానికి వాడుకోవాలని ప్రయత్నించాయని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, మోదీ మీడియా అసత్య ప్రచారాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.