MBNR: ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నామన్నారు.