SRCL: ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గూడా స్నేహలత (16) అనే విద్యార్థిని శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ శ్రీనివాస్ రెడ్డి స్రవంతి దంపతుల కూతురు స్నేహలత పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసింది. ఈరోజు విడుదలైన ఫలితాలలో అనుకున్న ర్యాంకు రాలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.