మన్యం: జిల్లా ప్రజలు తీర్థ యాత్రలకు, విహార యాత్రలకు వెళ్తే ముందస్తు జాగ్రత్తలతో చోరీలకు అడ్డుకట్ట వేయాలని పార్వతీపురం సీసీఎస్ సీఐ అప్పారావు పేర్కొన్నారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్లోలో ప్రయాణికులకు చైతన్య సదస్సు నిర్వహించారు. వేసవి సెలవులకు ఎవరైనా కుటుంబంతో పాటు ఊర్లు వెళ్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలన్నారు.