KMM: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు శనివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కార్యకర్తలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.