ASR: ప్రతి గ్రామంలో ఇంటింటికి రేషన్ అందించే ఎండీయూ ఆపరేటర్ల పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు సరికాదని డుంబ్రిగుడ ఎంపీపీ బాక ఈశ్వరి విమర్శించారు. శనివారం ఆమె డుంబ్రిగుడలో మాట్లాడారు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 221 మంది జీవితాలను రోడ్డున పడేసారన్నారు. 20 నెలలు గడువు ఉండగానే ఈనెల 17వ తారీఖున వారిని తొలగించే జీవో విడుదల చేయడం అన్యాయం అన్నారు.