SRPT: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు. లింగ నిష్పత్తి సమానంగా ఉండాలని, ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, ప్రజలు మానవతా దృక్పథంతో ఆలోచించి ఆడపిల్లలు పుట్టనివ్వాలని, ఎదగనివ్వాలని కోరారు. భ్రూణ హత్యలకు పాల్పడినా, పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.