సత్యసాయి: తెలుగు నేల ఉన్నంత కాలం.. టీడీపీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఆయువు పట్టు తెలుగుదేశం కార్యకర్తలు అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యకర్తే అధినేత అనే పిలుపును ఇవ్వబోతున్నట్లు తెలిపారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని తెలిపారు.