సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు క్షేత్రానికి తెల్లవారుజామునే తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయం వద్ద క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.