ASR: టీడీపీ ముంచంగిపుట్టు మండల అధ్యక్షురాలుగా కిల్లో సన్యాసమ్మ నియమితులయ్యారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి పార్టీ తనకు ఈ అవకాశం కల్పించినట్లు సన్యాసమ్మ శనివారం మీడియాకు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఆర్టీసీ రీజనల్ జోన్ ఛైర్మన్ సియారి దొన్నుదొర, జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.