SRD: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ దశరథ్ అన్నారు. కొండాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో టెక్నాలజీని ఉపయోగించుకుని బోధన చేయాలని చెప్పారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చేయాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.