SRD: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దశరథ్ డిమాండ్ చేశారు. కొండాపూర్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్ట పరిహారం ఎకరాకు 20వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. రైతు బీమాను 10 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు.