హీరో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కు ముందు థియేటర్లు బంద్ అనడం దుస్సాహసమేనని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏపీ ప్రభుత్వాన్ని ఎవరూ కలవలేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రతినిధులు కలవాలి కదా? అని చెప్పారు. గత సీఎంను సినిమా పెద్దలు ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. పవన్ పేషీ లేఖ సమర్థనీయమని పేర్కొన్నారు.