VZM: జులై 5న జరగనున్న లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కోరారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ… గజపతినగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీ పడదగిన 40 కేసులు ఉన్నట్లు తెలిపారు. కక్షిదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారు రాజీ పడేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.