KMR: ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనికులు చూపిన తెగువకు దేశమంతా జేజేలు పలుకుతోంది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ శివను బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని ఆయన చూపిన ధైర్యసాహసాలను కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో దేశం మొత్తం సైన్యానికి మద్దతుగా నిలుస్తుందన్నారు.