VZM: నెల్లిమర్ల మండలంలోని సతివాడ, కొండవెలగాడ సబ్ స్టేషన్ల పరిధిలోని రామతీర్థం, ఒమ్మి, పారసాం ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విజయనగరం టౌన్ డివిజన్ ఈఈ పి.త్రినాథరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా మధుపాడ, పినతరిమి, పెదతరిమి ఆయా గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.