• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మార్చి 2న యుద్ధ భేరి

KMR: TSCPSEU రాష్ట్రశాఖ పిలుపు మేరకు కేంద్రప్రభుత్వం తెచ్చిన UPS విధానానికి వ్యతిరేకంగా మార్చి 2న HYD ధర్నాచౌక్‌లో నిర్వహించే యుద్ధభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి దీనికి సంబంధించిన గోడపత్రులను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెస్తున్న UPS విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

February 12, 2025 / 06:00 AM IST

MHBD: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

MHBD:  గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్-నర్సంపేట నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఇండ్ల రమేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 12, 2025 / 05:03 AM IST

యువ మోర్చా కీలక పాత్ర పోషించాలి

NZB: ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని BJYM రాష్ట్ర అధ్యక్షుడు సెవేళ్ల మహేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మహేందర్ మాట్లాడారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం బలమైన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు.

February 12, 2025 / 04:51 AM IST

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NGKL: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మైనింగ్ చేస్తే వారిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మైనింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

February 11, 2025 / 02:09 PM IST

రేపే జాబ్ మేళా

NGKL: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐ.టీ.ఐ కళాశాలలో ఈనెల 12వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి బి.రాఘవేందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డి. ఫార్మసి, బి. ఫార్మసీ, డిప్లొమో ఇన్ అగ్రికల్చర్, డిప్లొమో ఇన్ హార్టి కల్చర్ చదివిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ ఆవకాశంను నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు.

February 11, 2025 / 01:50 PM IST

మల్లన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్

JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.

February 11, 2025 / 01:38 PM IST

టీబీ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన

KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో 100 డేస్ TB ప్రోగ్రాంలో భాగంగా గ్రామ ప్రజలకు TBపై అధికారులు అవగాహన కల్పించారు. కరీంపేటలో 21 శాంపిల్స్, ఇప్పలపల్లిలో14, అంబాలాపూర్ 12 శాంపిళ్లను సేకరించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఆకలి మందగించడం, అతిగా చెమటలు రావడం, బరువు తగ్గడం, 3 వారాలకు మించి దగ్గు లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 

February 11, 2025 / 01:22 PM IST

భార్యాభర్తల ఆత్మహత్య

MLG: జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఆలెం స్వామి, భార్య అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 11, 2025 / 12:55 PM IST

చిలుకూరి ఆలయ అర్చకుడికి కేంద్రమంత్రి ఫోన్

KNR: రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగరాజన్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్‌లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

February 11, 2025 / 12:53 PM IST

13న బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు వరంగల్ పశ్చిమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బీసీ కుల గణన నివేదిక, 420 హామీల అమలు తీరుపై విస్తృతస్థాయిలో చర్చ చేయనున్నట్లు పేర్కొన్నారు.

February 11, 2025 / 12:52 PM IST

పంట పొలంలో కొండ చిలువ

WGL: చెన్నారావుపేట మండలం తిమ్మారాయనిపహాడ్‌లోని మొక్కజొన్న చేనులో మంగళవారం సందీప్ అనే యువరైతు పొలానికి వెళ్లగా అక్కడ కొండచిలువ కనిపించింది. భయానికి గురైన రైతు.. గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామానికి చెందిన యువకుల సహకారంతో ప్రాణంతో ఉన్న కొండచిలువను పట్టుకొని గ్రామపంచాయతీ ఆవరణలో తీసుకువచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

February 11, 2025 / 12:51 PM IST

వార్డు అధికారుల ద్వారానే పన్నుల వసూలు: కమిషనర్

KNR: కరీంనగర్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ పరిధిలో వార్డు అధికారుల ద్వారానే పన్నుల వసూలు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీ, 6 గ్రామాల్లో వార్డు అధికారులే ప్రత్యేక యంత్రాల ద్వారా ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, నల్ల బిల్లులు వసూలు చేస్తారని తెలిపారు.

February 11, 2025 / 12:35 PM IST

కామారెడ్డి UPHCలో అమ్మఒడి కార్యక్రమం

KMRD: పట్టణంలోని UPHCలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యాధికారి డా. చందన ప్రియ తెలిపారు. గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. రక్తహీనత లేకుండా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్, తదిరులు ఉన్నారు.

February 11, 2025 / 11:03 AM IST

మూసీ నదికి నిధులు కేటాయింపు!

HYD: మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.

February 11, 2025 / 11:03 AM IST

పట్టణంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం

NRML: మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్టించి పట్టణంలోని పురవీధుల గుండా శోభయాత్ర కొనసాగించారు.

February 11, 2025 / 11:02 AM IST