MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. నాయకులు మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్ల శంకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.