ADB: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం ఉత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా హాజరై మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం మహిళ, ట్రాన్స్ జెండర్ ప్రయాణికులు, ఉద్యోగులను కలెక్టర్ శాలువాతో సన్మానించారు.