NRML: హెచ్‌సీఏలో అవినీతి కొనసాగుతోందని నిర్మల్ జిల్లా టీసీఏ కోచ్ రామరాజు ఆదివారం ఆరోపించారు. రూ.69 కోట్ల విశాఖ ఒప్పందంలో నష్టంపై చర్యలు లేకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. 103 క్రికెట్ క్లబ్బులు గల్లంతు కావడం, 80 అక్రమ ప్రైవేట్ క్లబ్బులు పెరగడం ఆందోళనకరమని తెలిపారు. జస్టిస్ ఎన్.ఏ. కాక్రు కమిటీ నివేదికలో సభ్యత్వంలో భారీ అవకతవకలు బయటపడ్డాయని వారు పేర్కొన్నారు.
WGL: జిల్లాలో వేసవి ప్రారంభమైతే గ్రామాల్లో పిల్లలు చెట్ల నీడలో అష్టచమ్మ, కోతికొమ్మ వంటి ఆటలతో ఆనందంగా గడిపే రోజులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్లు బిజీ జీవిత శైలితో పల్లె సంస్కృతి క్రమంగా తగ్గిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని కష్టసుఖాలు పాలుపంచుకునేవారు. ఇప్పుడు అది లేదని చింతిస్తున్నారు.
JGL: ప్రముఖ జీవిత బీమా సంస్థ SBI లైఫ్ ఇన్సూరెన్స్ 25 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలను జగిత్యాల బ్రాంచులో నిర్వహించారు. SBI లైఫ్ ఇప్పటివరకు మొత్తం ₹3,06,452 కోట్ల క్లెయిమ్స్‌ను చెల్లించి కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకొని, దేశవ్యాప్తంగా 8.36 కోట్లకు పైగా పాలసీ హోల్డర్లకు 1176 బ్రాంచులు సేవలందిస్తుందన్నారు.
NGKL: లింగాల మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
MDK: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో విశేష స్పందన వచ్చింది. కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 5,454, సంగారెడ్డి జిల్లాలో 4,868, మెదక్ జిల్లాలో 2,583 కేసులు పరిష్కారంమైనట్లు అధికారులు తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామన్నరు.
GDWL: గట్టు మండలం మాచర్ల గ్రామంలో ఆదివారం మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సందర్శించి పర్యవేక్షించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వజ్రమ్మ, పంచాయతీ కార్యదర్శి మునినాయక్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
WNP: పట్టణంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన సంఘటన సమాజానికి తలవంపు అని సంఘటనపై మంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయం అని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ మాజీ ఛైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని పేర్కొన్నారు. BRS నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
VKB: వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రారంభించి, ట్రాఫిక్ నియమాల పాటించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకమని సూచించారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
MULG: టీడీపీ ఆవిర్భావం తర్వాతే ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని, సంక్షేమ పథకాలు సామాన్యుడికి చేరాయని మండల అధ్యక్షుడు ఎంఏ సలీం అన్నారు. ఆదివారం ములుగు పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరాయని అన్నారు.
SRCL: జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి స్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలవేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. టిడిపి హయంలో చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.
ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్, భీంపూర్, తాడిహత్నూర్, సుంగాపూర్, కొత్తపల్లి(H) తదితర గ్రామాల్లో ఆదివారం అమ్మకు అక్షరమాల అభ్యాసకులకు FLNAT/NIOS పరీక్షలు నిర్వహించినట్లు ఏపీఎం జాడి రాజారామ్ తెలిపారు. ప్రత్యేక ఏర్పాట్లతో మొత్తం 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారని వెల్లడించారు.
KNR: చొప్పదండి నియోజకవర్గంలోని బస్ స్టేషన్ల అభివృద్ధితో పాటు కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్‌కు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరుగుతుండడంతో నియోజకవర్గాల వారిగా మౌలిక సదుపాయాలు, కొత్త బస్సులు, బస్ స్టేషన్ల గురించి మంత్రి, అధికారులతో సమావేశం నిర్వహించారు.
SRPT: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 3,890 కేసులు పరిష్కారమైనట్లు ఈరోజు ఎస్పీ నరసింహా తెలిపారు. ఇందులో ఎంవీ యాక్ట్, ఈ -పెట్టీ, ఐపీసీ సహా పలు కేసులు ఉన్నాయి. త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని, దీనివల్ల ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన వారిని ఆయన అభినందించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో గత కొద్ది రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీరు ఎగువ ప్రాంతాలకు అందడం లేదు. ఒకపక్క పైపులైనుల లీకేజీలు, అక్రమ మోటార్ల వాడకంతో అందరికీ తాగునీరు అందకుండా పోయింది. ట్యాంకర్ ద్వారా పంపిస్తున్న తాగునీరు ప్రజల అవసరాలను తీర్చలేక పోతుంది. ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం చలివేంద్రమును యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గండికోట సంపత్ మాట్లాడుతూ.. వేసవికాలం ముగిసే వరకు బాటసారులకు మజ్జిగ, నీరు నిమ్మకాయ రసం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.