ADB: నేరడీగొండ మండలంలోని కుమారి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదివారం పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులున్నారు.