• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కాలేశ్వరం ఆలయ విశిష్టత తెలుసా..?

BHPL: జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఈ దేశంలో ఎక్కడాలేని విశిష్టత ఉంది. శివుడు,యముడు ఒకే పానవట్టంపై లింగాకృతిలో కలిసి ఉండటం ఈ గుడి ప్రత్యేకత. ఈ ప్రాంతం త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి) తీరంగా ఉంది. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి గోదావరి, సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి.

March 29, 2026 / 12:27 PM IST

HPV టీకాతో క్యాన్సర్‌కు చెక్: డాక్టర్ మహేందర్

VKB: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా ఎంతో కీలకమని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మహేందర్ తెలిపారు. ఆసుపత్రిలో విద్యార్థినులకు టీకాలు వేసిన ఆయన.. మహిళల్లో ఈ వ్యాధి రాకుండా ప్రభుత్వం ముందస్తుగా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోందని పేర్కొన్నారు. 14 ఏళ్లు నిండిన బాలికలందరూ తప్పనిసరిగా ఈ టీకా తీసుకోవాలని సూచించారు.

March 29, 2026 / 12:27 PM IST

హోటళ్లపై అధికారుల తనిఖీలు

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటేషన్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. గోదావరిఖని లక్ష్మీ నగర్ రెస్టారెంట్‌లో నాణ్యతలేని ఆహారం విక్రయిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ. 5,000 జరిమానా విధించారు. అలాగే నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న పలు దుకాణాలకు రూ. 3,000 జరిమానా విధించినట్లు సానిటరీ ఇన్స్‌పెక్టర్లు నాగభూషణం, సంపత్ తెలిపారు.

March 29, 2026 / 12:26 PM IST

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల వేడుకలు

SRCL: చందుర్తి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జెండా గద్దె వద్ద టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగంపల్లి వెంకటి, మెంగని హన్మాండ్లు, మర్రి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 12:19 PM IST

రూ. 60 వేల CMRF చెక్కు అందజేత

MNCL: అనారోగ్యంతో ఇబ్బంది పడే పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా పనిచేస్తుందని బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి సర్పంచ్ మహేశ్వర్ అన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన అనిల్‌కు మంజూరైన రూ. 60 వేల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.

March 29, 2026 / 12:19 PM IST

ప్రొ.అన్సారికి మద్దతుగా ఓయూ రీసర్చ్ విద్యార్థులు

MDCL: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అన్సారి ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రీసెర్చ్ విద్యార్థులు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయడం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో JAC నాయకులు మూర్తి సైతం పాల్గొని, న్యాయం చేసేలా పోరాడుతామన్నారు.

March 29, 2026 / 12:17 PM IST

సీపీఐ నాయకుడి సంతాప సభ గోడపత్రిక ఆవిష్కరణ

RR: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండి రాములు సంతాప సభ గోడపత్రికను ఈరోజు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని భూపోరాట కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర నాయకులు రామస్వామి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొండి రాములు కార్మికుల, కర్షకుల కోసం పోరాడిన నాయకులు అని కొనియాడారు.

March 29, 2026 / 12:17 PM IST

గంటలోనే పోగుట్టుకున్న మొబైల్ రికవరీ

MNCL: కాగజ్ నగర్ మండలం చింతగూడకు చెందిన వడాయి సాయికుమార్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి కేవలం గంట వ్యవధిలోనే ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అప్పగించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని SI సందీప్ కుమార్ సూచించారు.

March 29, 2026 / 12:16 PM IST

‘ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలి’

NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 31వ తేదీలోగా ఇంటి పనులు వివిధ దుకాణాల వ్యాపారస్తులు పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి 2 పైసల వడ్డీతో ఇంటి పనులు అదనంగా జమ అవుతుందని పేర్కొన్నారు.

March 29, 2026 / 12:13 PM IST

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే

JGL: పేదల సంక్షేమానికి అండగా ఉండడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలకు చెందిన సునీత నరాల వ్యాధితో బాధపడుతూ.. చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం సహాయ నిధి నుంచి రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు చేసి కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రభుత్వం పేదల వైద్య అవసరాల కోసం సహాయం అందిస్తోందని, అర్హులైన వారు పథకాలను వినియోగించుకోవాలన్నారు.

March 29, 2026 / 12:10 PM IST

ఈనెల 7న పరిగిలో తైబజార్ వేలం

VKB: పరిగి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ వేలం వచ్చే ఏప్రిల్ 7 మంగళవారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ వెంకటయ్య తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఏప్రిల్ 6న సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రచురితమైన నోటీసును సవరించి తాజా తేదీని ప్రకటించినట్లు తెలిపారు.

March 29, 2026 / 12:09 PM IST

‘ఆసుపత్రులకు అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే’

MHBD: పెద్దవంగర మండల కేంద్రంలోని వారాహి హాస్పిటల్‌ను DMHO రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యులే చికిత్స అందించాలని సూచించారు. ఆస్పత్రులకు అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని, అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 29, 2026 / 12:09 PM IST

మానవత్వం చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు

NLG: నకిరేకల్‌కు చెందిన ‘లిటిల్ సోల్జర్స్’ ఫౌండేషన్ మానవత్వం చాటుకున్నారు. అటిజంతో బాధపడుతున్న ఏడేళ్ల హయాన్ చంద్ర దీనస్థితి గురించి ఫౌండేషన్ సభ్యులు బ్రహ్మదేవర నరేష్, మట్టిపల్లి వెంకన్న.. ఆదివారం సూర్యాపేటలోని బాలుడి ఇంటికి వెళ్లి రూ.22,200 లు ఆర్థిక సాయం అందించారు. ఆపదలో అండగా నిలిచిన లిటిల్ సోల్జర్స్ సభ్యులకు బాలుడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

March 29, 2026 / 12:07 PM IST

ఈసారి కూడా ముంపు ప్రజలకు నిరాశ మిగిలింది

BDK: భద్రాచలం శ్రీ రామ నవమి వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వరాలజల్లు కురిపిస్తారని అనుకున్న గోదావరి వరద ప్రాంత ప్రజలకు ఈసారి నిరాశే మిగిలింది. ప్రతి ఏటా వరద ముంపుకు గురై పంట నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం ఆనకట్టలు మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరారు. కానీ ఈ విషయంపై సీఎం చర్చించకపోవడం విశేషం.

March 29, 2026 / 12:05 PM IST

రేపు దుకాణాల వేలం

KNR: గన్నేరువరం గ్రామ పంచాయతీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ ఆస్తుల వేలం ఈనెల 30న ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ లచ్చినర్సు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 17 షెటర్లు, గ్రామ సంతను వేలంపాట నిర్వహిస్తున్నామని, ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు.

March 29, 2026 / 12:02 PM IST