MBNR: ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేది ఎర్రజెండా అని పీసీసీ ఉపాధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. వివిధ రంగాలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం అనే అంశాలపై సీపీఎం నిర్వహించిన సెమినర్‌లో కొత్వాల్ పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
HYD: సికింద్రాబాద్ కోటక్ మహేంద్ర సమీపాన ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా కవర్లు రావడంతో షాక్ అయ్యారు. ఈ విషయాన్ని యాజమాన్యాన్ని అడగగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన అతను, వారిపై తగిన విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
SRPT: తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అనంతారం గ్రామంలో శ్రీకంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, గ్రామదేవతల పండుగలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు.
SRD: కంగ్టిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మరణించారు. స్థానికుల తెలిపిన వివరాలిలా.. మహారాష్ట్రలోని భూతం హిప్పర్గా కు చెందిన అశోక్ పాటిల్ కంగ్టి మండలం తుర్కవడగాంలో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వెళ్తున్న క్రమంలో కంగ్టిలోని డివైడర్ ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. కంగ్టి పోలీసులు కేసు నమోదు చేశారు.
ADB: జైనథ్ మండలంలోని ఆకుర్ల గ్రామంలో శ్రీ బాజీరావు మహారాజ్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. బాజీరావు మహారాజ్ ప్రవచించిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.
SRD: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఇవాళ సంగారెడ్డిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా డాక్టర్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్, కోశాధికారిగా హరినాథ్, గౌరవ అధ్యక్షునిగా రాజు గౌడ్ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, ఉష, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.
HNK: సర్వే వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఈనెల 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని, వివరాలు నమోదు చేసుకోని వారు చేసుకోవాలన్నారు. ఆదివారం కాజీపేట సర్కిల్-2లో ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి వివరాల నమోదు తీరును పరిశీలించారు.
MDK: RTC బస్సు కోసం మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లాదుర్గం మండలంలోని ఐబి చౌరస్తా వద్ద ఇవాళ మహిళలు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బస్సులను విడుదల చేసిందని ప్రకటించినప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు ప్రయాణీకులు పేర్కొన్నారు. తమకు సరిపడా బస్సులు నడపాలని కోరుతున్నారు.
MHBD: సీరోలు మండల కేంద్రంలో అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న నిషేధిత 8 క్వింటాళ్ల నల్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించడం కోసం ఇద్దరు వ్యక్తులు వాహనంలో నల్లబెల్లం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
NZB: పట్టపద్దుల MLC అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ఇవాళ మోస్రా మండల కేంద్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి ఇన్‌ఛార్జ్ పెద్దల గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
MNCL: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని జన్నారం ఎస్ఐ గుడెంటి రాజవర్ధన్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. సమాజం బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విరివిగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
HYD: ఘట్కేసర్ పరిధి జగదాంబ థియేటర్ పరిసర ప్రాంతాల్లో కిన్లి డూప్లికేట్ వాటర్ బాటిళ్లలో వాటర్ పోసి పలువురు విక్రయిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఇంకా వాటర్ బాటిల్ సీల్ తీసి ఉంటుందని ఆయన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఘట్కేసర్ పోలీసు అధికారులు, డూప్లికేట్ కిన్లి బాటిల్ తీసుకొని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
KMR: పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఈ ఏడాది వ్యవసాయ బోరు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోరుబావుల్లో నీరురాక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న సాగుచేశారు. బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడంతో కొత్తగా బొర్లు వేసిన నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
HYD:మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపునకు చర్యలు చేపట్టామని GHMC శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్తాపూర్ నుంచి చాదరాఘాట్ వరకు ఈనెల 3నుంచి 14వరకు నదిని శుభ్రం చేసే పనులు చేట్టామని చీఫ్ ఎంటమాలజిస్ట్ ఎస్. పంకజ అన్నారు. గుర్రపుడెక్కను తొలగించడం,నదిలో దోమలమందు పిచికారీ,సమీప కాలనీలలో ఉస్మానియా ఆసుపత్రి, ప్రాంతాల్లో ఫాగింగ్ వంటివి నిర్వహంచామన్నారు.