NRML: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం సూచించారు. తానూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
KMR: యువజన కాంగ్రెస్ జిల్లా,నియోజకవర్గ అధ్యక్షులకు 3రోజులు శంషాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువ క్రాంతి బునియాద్’కు ఢిల్లీ నుంచి వచ్చిన బృందం నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణలో KMR జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జుక్కల్, బాన్సువాడ అధ్యక్షులు ఇమ్రోజ్, మన్సూర్ పాల్గొన్నారు.
JGL: జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగవైభవంగా ప్రారంభం అయింది. జాతరలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు రూ.5 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
KMR: కామరెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ఏవో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
NRML: నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ హరితహారంతో రాష్ట్రాన్ని పచ్చదనంగా అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందని అన్నారు.
NZB: కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌లో తెలంగాణ సెక్రటేరియట్ హాకీ టీం విజయం సాధించిందని కెప్టెన్ డాక్టర్ స్వామి కుమార్ తెలిపారు. హోరాహోరి పోరులో మధ్యప్రదేశ్ జట్టుపై నాలుగు మూడు స్కోర్‌తో ఘనవిజయం సాధించింది. 3-3తో డ్రాగ ముగుస్తున్న సమయంలో చివరి నిమిషంలో జనార్ధన్ గోల్ కోటడంతో విజయం సాధించినట్లు తెలిపారు.
SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్ గాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం పదవి కాలం మరో 6 నెలల పాటు ప్రభుత్వం పొడిగించిందని చైర్మన్ గుండు వెంకట్ రాములు తెలిపారు. తమ పాలకవర్గం పదవీకాలం పూర్తి చేసుకోవడంతో అభివృద్ధి కుంటు పడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పదవి కాలం పొడిగింపు పట్ల పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
SRD: సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో రెండు కోట్లతో నిర్మిస్తున్న బీసీ బాలుర హాస్టల్ భవన నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలల నుంచి ఇక్కడ పనులు జరగడం లేదు. తలుపులు కిటికీలో బిగించి రంగులు వేస్తే హాస్టల్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. స్పందించి హాస్టల్ భవన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
SRD: పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్ (42) ఉపాధి కోసం అమీన్‌పూర్ వెళ్లి, బామ్మర్ది నరేశ్ నాయక్‌తో కలిసి జేసీబీ కొనుగోలు చేశాడు. నెల క్రితం దానికి పోస్టల్ బీమా చేయించగా, బావ మృతిచెందితే డబ్బు వస్తుందని ఆశపడి సురేశ్, మేనమామ దేవీసింగ్‌తో కలిసి ఈనెల 14న బీమా డబ్బుల కోసం హత్య చేశారు.
MBNR: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై శివనాగేశ్వర్నాయుడు తెలిపిన వివరాలు.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కి చెందిన సోప్పరి రాఘవేందర్ మిడ్జిల్ మండలం చిల్వేర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
SRD: పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈనెల 17 నుంచి మార్చి 15వ తేదీ వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం తెలిపారు. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్ జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని ఆమె చెప్పారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో మహిళపై శనివారం రాత్రి అత్యాచారం జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన గిరిజన దంపతులు అనంతపురం జిల్లా నేరేడుగొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేశారు.
ADB: గుడిహత్నూర్ మండలం నూతన ఎస్సై మహేందర్ ను సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో యువకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో యువత కీలకపాత్ర వహించాలని ఆయన పేర్కొన్నారు. యూత్ అధ్యక్షుడు జైపాల్, సావిందర్, పవన్, సునీల్, మోహన్, ఆకాష్, గౌరీ, విష్ణు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
VKB: గత ప్రభుత్వ నిర్మాణ పనుల బిల్లులు రాక తీవ్ర మనస్తాపానికి గురైన బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చింతకింది వెంకటప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే అతడిని వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రికి తరలించారు.