BDK: కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో ఈ నెల 16వ తేదీన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులపాటు మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఎంపికైన వారు సకాలంలో స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు.
GDL: మానవపాడు మండలంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు. వివరాల ప్రకారం.. అయిజకు చెందిన రాజేశ్ భార్యతో బైక్‌పై పెద్దపోతులపాడు వచ్చారు. రోడ్డు పక్కకు బైక్ ఆపాడు. ఈ క్రమంలో బోయ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రోడ్డుపై నుంచి బండి తీయమని కులం పేరుతో దూషించి, తనపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఖైరతాబాద్‌లో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డిని గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎం. ఆనంద్ కుమార్ గౌడ్ కలిశారు. అశోక్ రెడ్డితో అనేక సమస్యలపై చర్చించారు. గతంలో తాను గోషామహల్‌లో పర్యటించిన సందర్భంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. పాడైన ఒక హ్యాండ్ బోర్ స్థానంలో ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశించారు.
WGL: జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్నఈ పరీక్షలకు 11, 309 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 28 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
WGL: జిల్లా కలెక్టర్ సత్యశారద శుక్రవారం గీసుకొండ మండలం వంచనగిరిలో చేపల చెరువు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. అగ్రికల్చర్‌కి ప్రత్యామ్నాయంగా ఆక్వా కల్చర్‌ని పెంపొందించేందుకు గాను చిన్న రైతులు యొక్క ఆర్థిక ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వపధకం క్రింద చెరువులు తవ్వడానికి పర్మీషన్ ఇవ్వడం జరిగింది.
KMRD: రక్తమేబడం ద్వారా ప్రాణాలు కాపాడే సామాజిక సేవ చాలా గొప్పదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అన్నారు. 50 మంది రక్తదానం చేశారు. ఎస్సీ శ్రావణ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
RR: మహేశ్వరం చౌరస్తాలో పార్టీలకు అతీతంగా జాతీయోధ్యమ, నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని కేఎల్ఆర్, కాంగ్రెస్ సహా విపక్ష నాయకులకు సూచించారు. ఏ వర్గం అసంతృప్తి లేకుండా చౌరస్తా రింగ్ లోపల విగ్రహాలను నిలపాలన్నారు.
BDK: జిల్లాలో ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు అభ్యర్థులు అరగంట ముందుగానే చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు టాటూలు మెహందీలు వేసుకోకూడదని సూచించారు.
NLG: డంపింగ్ యార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువవర్మి కంపోస్టు తయారీకి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకు గాను100% తడిచెత్త, పొడిచెత్తలను సేకరించాలన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చందనపల్లిలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వల్లతాగునీరు కలుషితం కాకుండాచూసుకోవాలని, ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేయాలన్నారు.
WGL: కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లపై జరిగిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
HYD: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ నుంచి జూపల్లిని తొలగించి బీసీలైన మంత్రులకు ఆ శాఖను అప్పగించాలన్నారు.
SRCL: సిరిసిల్ల పట్టణంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వసంతరావు ఆధ్వర్యంలో, సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్లను, పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ అంజలి తనిఖీ చేశారు. గర్భస్థ పూర్వ పిండ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ జరిపిన నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MDK: మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం పోచారం అభయారణ్యంపై జిల్లా అటవీశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. ఏడుపాయల దుర్గాభవాని మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మెదక్ పట్టణంలోని స్టేడియం దగ్గరలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పాల్గొంటారు.
WGL: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 73 రోజుల్లో రూ.81, 68, 044 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 146 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 26 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 550 కేజీలు వచ్చాయన్నారు.
WGL: కొమురవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ అధికారులు శుక్రవారం వేగవంతం చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ సర్వేలో ఎంపీడీవో, గ్రామ సెక్రెటరీ బాల్ రాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.