• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పోటాపోటీగా తై బజార్ వేలం..

KMR: జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారాంతపు, రోజువారీ సంతల వేలం పాటను శనివారం నిర్వహించారు. సర్పంచ్ సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ వేలం ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ప్రతి గురువారం జరిగే వారాంతపు సంతను జావిద్ బాగ్ వాన్ అత్యధికంగా రూ. 3,25,000 చెల్లించి వేలంలో దక్కించుకున్నారు.

March 28, 2026 / 05:01 PM IST

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎస్సై

MBNR: వేసవి తాపం కారణంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్సై శేఖర్ రెడ్డి సూచించారు. పాఠశాలలు త్వరగా ముగియడంతో పిల్లలను నిర్లక్ష్యంగా బయటకు పంపకూడదన్నారు. బావులు, చెరువులు, కుంటల వద్ద పర్యవేక్షణ లేకుండా వెళ్లనివ్వవద్దని హెచ్చరించారు. వేసవిలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

March 28, 2026 / 05:01 PM IST

నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన వైద్యులు

NRML: పిల్లల వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్‌పై జరిగిన దాడిని ఐఎంఏ, స్థానిక వైద్యులు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 24 గంటలు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు అమానవీయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ఓపీ సేవలను గంటపాటు నిలిపివేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శనివారం డిమాండ్ చేశారు.

March 28, 2026 / 05:01 PM IST

పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దాం: మహేష్ కుమార్

NZB: ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్ధే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

March 28, 2026 / 05:01 PM IST

నారాయణపేటలో సంతల వేలం

NRPT: నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో తై బజార్, జంతు వధశాల, పశువుల సంత, మాంస వ్యర్థాల సేకరణకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ నర్సయ్య తెలిపారు. పాల్గొనే వారు తై బజార్‌కు రూ.లక్ష, వధశాలకు రూ.50 వేలు, వ్యర్థాల సేకరణకు రూ.లక్ష, పశువుల సంతకు రూ.లక్ష డీడీలు కట్టాలన్నారు. అలాగే రశీదులని ఈనెల 30న మధ్యాహ్నం 12లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

March 28, 2026 / 05:01 PM IST

మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

NLG: నాంపల్లి మండలంలోని ఎస్‌డబ్ల్యూ లింగోటం పంప్ హౌస్‌లో 440 స్థాయి పంపుల బేరింగ్‌లు విరిగిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు రాబోయే 3 రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు వెల్లడించారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు.

March 28, 2026 / 05:01 PM IST

వార్డు అభివృద్ధే ముఖ్య లక్ష్యం: కౌన్సిలర్

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ 12వ వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలు, కంప చెట్ల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వార్డు కౌన్సిలర్ మెంట రమణ వెంటనే పరిష్కరించారు. స్థానికుల విన్నపం మేరకు స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకున్న కౌన్సిలర్ JCB సహాయంతో మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించిన కౌన్సిలర్‌ను వార్డు ప్రజలు అభినందిస్తున్నారు.

March 28, 2026 / 05:01 PM IST

చిన్నారి అంతక్రియలకు సమ్మి గౌడ్ ఆర్థిక సహాయం

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం (హన్మంతరావు) కాలనీకి చెందిన రాజు- సునీత దంపతుల రెండవ కుమార్తె కృప డెంగ్యూ బారినపడి కన్ను మూసింది. సమాచారం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత ఖర్చులతో చిన్నారి అంతక్రియల కోసం ఆ కుటుంబానికి రూ.5,000 తక్షణ సాయం అందించి పెద్ద దిక్కుగా నిలిచారు.

March 28, 2026 / 05:00 PM IST

‘బీసీల రిజర్వేషన్‌లకు ప్రభుత్వం చొరవ చూపాలి’

BDK: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లాలని MLA కూనంనేని సాంబశివరావు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం తీర్మానం చేసినా, తుది నిర్ణయం కేంద్ర పరిధిలోనే ఉందని గుర్తుచేశారు.

March 28, 2026 / 05:00 PM IST

చెన్నూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్ ఏకగ్రీవం

MNCL: చెన్నూర్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రవీందర్, ఉపాధ్యాక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా మహేష్, జాయింట్ సెక్రటరీగా వికాస్ కచ్‌వా , కోశాధికారిగా రాజేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 28, 2026 / 05:00 PM IST

ఆరోపణలు నిరూపిస్తే ఉరి వేసుకుంటాం: బీఆర్‌ఎస్

WNP: కాంగ్రెస్ మైనార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ.. అక్షర స్కూల్ యాజమాన్యాన్ని తాము డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే రాజీవ్ చౌరస్తాలో బహిరంగ ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని అన్నారు.

March 28, 2026 / 05:00 PM IST

‘కనీసం కొబ్బరికాయ కొట్టేందుకు కూడా పిలవడం లేదు’

RR: యాచారం మండలంలోని అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదని మాల్ గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యుడు ప్లకార్డులతో నిరసనకు దిగారు. తన వార్డులో జరుగుతున్న పనులకు సంబంధించి కనీసం కొబ్బరికాయ కొట్టేందుకు కూడా పిలవడం లేదని ఆయన ఆరోపించారు. సమాచారం దాచడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 28, 2026 / 05:00 PM IST

మైనింగ్‌పై అసెంబ్లీ కమిటీ వేయాలని BRS ఎమ్మెల్యేల డిమాండ్

HYD: మైనింగ్‌పై అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి నియోజకవర్గం BRS పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. BRS ఎమ్మెల్యేలు అందరు కలిసి అసెంబ్లీ స్పీకర్ చైర్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

March 28, 2026 / 04:55 PM IST

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: R&B ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్ శ్రీహర్ష శనివారం సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. పెద్దపల్లి- కాటారం రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు, లింగాపూర్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మానేరు నదిపై నిర్మించే బ్రిడ్జి టెండర్, మంథని గెస్ట్ హౌస్ నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

March 28, 2026 / 04:52 PM IST

‘దివ్యాంగులకు డిప్యూటేషన్ బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలి’

WGL: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల డిప్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని అధికారులను దివ్యాంగుల నాయకుడు సురేష్ కోరారు. ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి బదిలీ కావడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి దివ్యాంగులకు బాసటగా నిలవాలని కోరారు.

March 28, 2026 / 04:50 PM IST