• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి భార్గవరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు, సీట్లు పంపిణీ చేశారు. పార్టీ స్థాపించి నేటికి 44 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీనే అని అన్నారు.

March 29, 2026 / 01:31 PM IST

అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని దీక్ష భూమి వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలు, వాల్‌పేపర్ పోస్టర్లను అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకుంటూ, కులాలకు అతీతంగా సమానత్వ భావంతో జయంతిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి దిక్సూచి అన్నారు.

March 29, 2026 / 01:28 PM IST

ఉల్లాస్ ద్వారా వయోజనులు అందరికీ ప్రవేశ పరీక్ష

SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో మహిళా గ్రూప్స్ ఆధ్వర్యంలో “ఉల్లాస్ “ద్వారా గ్రామంలోని వయోజనులు అందరికీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా చదువురాని మహిళలందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఉల్లాస్‌ పథకం ప్రధాన లక్ష్యం అని సర్పంచ్ తోడేటి రమేష్ అన్నారు. ఉపసర్పంచ్ పెండ్యాల సంపత్ రెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి రజిత, పాల్గొన్నారు.

March 29, 2026 / 01:26 PM IST

సలేశ్వరం జాతరకు 25 ప్రత్యేక బస్సులు

NGKL: సలేశ్వరం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఏప్రిల్ 1వ నుంచి 3వ తేదీ వరకు నాగర్‌ కర్నూల్ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య ఈరోజు తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా వర్తిస్తుందన్నారు.

March 29, 2026 / 01:23 PM IST

పిన్నాయిపాలెంలో సీ.సీ. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

సూర్యాపేట మండలం పిన్నాయిపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో సీ.సీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధిలో భాగంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.

March 29, 2026 / 01:22 PM IST

ప్రాణాలు తీస్తున్న రాంగ్ రూటు డ్రైవింగ్..!

MDCL: ఘట్‌కేసర్, కీసర ప్రాంతాలలో గత ఐదు నెలల్లో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎనిమిదికి పైగా కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రాణాలు తీస్తోందని, త్వరగా వెళ్లొచ్చని రాంగ్ రూట్‌లో వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు.

March 29, 2026 / 01:21 PM IST

కొత్త సైడ్ డ్రేయిన్స్ నిర్మాణం పనులు ప్రారంభం

SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం ఎస్సీ కాలనీలో కొత్తగా సైడ్ డ్రేయిన్స్ నిర్మాణం పనులను ఆదివారం సర్పంచ్ రవీందర్ పాటిల్ ప్రారంభించారు. CRR ప్రత్యేక నిధులు రూ. 10 లక్షలతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. మొత్తం 360 మీటర్ల పొడవు CC సైడ్ డ్రేయిన్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామంలో స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలన్నారు.

March 29, 2026 / 01:20 PM IST

‘నియోజకవర్గ సాధన ర్యాలీ విజయవంతం చేయాలి’

MDK: రామాయంపేట నియోజకవర్గ సాధన కోసం రేపు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి మహేందర్ గౌడ్ తెలిపారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, మండల పరిధిలోని నాయకులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

March 29, 2026 / 01:17 PM IST

మాజీ మంత్రిపై యువ నేత గుమ్మల శీను తీవ్ర విమర్శలు

MBNR: మాజీమంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్‌పై యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల శీను ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయ్యాక కూడా అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీలైతే అభివృద్ధికి పాటుపడాలి కానీ, ఇలా ప్రతిదానికి అడ్డంపడితే ఎలా అని ప్రశ్నించారు.

March 29, 2026 / 01:16 PM IST

రేపు ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్

BDK: పినపాక మండలంలో రేపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యురాలు నేడు దుర్గ భవానీ తెలిపారు. రోగులు పాత మెడికల్ రిపోర్టులు, ఆధార్ కార్డుతో హాజరవ్వాలని తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తాల్మాలజిస్ట్, డెంటిస్ట్ వంటి నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

March 29, 2026 / 01:15 PM IST

ఘనంగా TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JN: స్టేషన్ ఘనపూర్‌లో TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ రజనీకాంత్ హాజరై మాట్లాడుతూ.. అనునిత్యం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ పేదలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని అన్నారు.

March 29, 2026 / 01:15 PM IST

రేపు మరిపెడ మున్సిపల్ వార్షిక బడ్జెట్

MHBD: మరిపెడ మున్సిపాలిటీలో సోమవారం మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విజయనాంద్ తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లు హాజరు కావాలని ఆయన కోరారు.

March 29, 2026 / 01:10 PM IST

‘రోబో ఫెస్ట్’​.. ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు

NZB: జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల రోబోటిక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని శ్రీరామ గార్డెన్స్​లో ‘టెక్టానికా 2026’ పేరిట రోబో ఫెస్ట్​ ఆదివారం నిర్వహించారు. కాకతీయ విద్యా సంస్థలకు చెందిన ప్రగతినగర్ క్యాంపస్, సుభాష్ నగర్ క్యాంపస్ KOSI 20 క్యాంపస్​ల విద్యార్థులు సుమారు 350కి పైగా ప్రాజెక్టులు రూపొందించడం అభినందనీన్నారు.

March 29, 2026 / 01:10 PM IST

పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమైన ప్లాటినం జూబ్లీ వేడుకలు

WGL: ఎంజీఎం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్, కళాశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నవారు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

March 29, 2026 / 01:10 PM IST

ప్రారంభమైన ప్లాటినం జూబ్లీ వేడుకలు

WGL: ఎంజీఎం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్, కళాశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నవారు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

March 29, 2026 / 01:10 PM IST