MDCL: ఘట్కేసర్, కీసర ప్రాంతాలలో గత ఐదు నెలల్లో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎనిమిదికి పైగా కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రాణాలు తీస్తోందని, త్వరగా వెళ్లొచ్చని రాంగ్ రూట్లో వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు.