JGL: వేసవికాలం దృష్ట్యా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్‌లో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. ఎస్సీ కాలనీలోని 6, 9వ వార్డులో లో వోల్టేజ్ సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి మినీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు. విద్యుత్ అధికారులు వీటిని బిగించారు.
NLG: 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగనుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. మునుగోడు విభజన, సూర్యాపేట కేంద్రంగా కొత్త పార్లమెంటు స్థానం ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియలో దక్షిణ భారత్‌కు అన్యాయం జరగకుండా చూడాలని, విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. శనివారం ఒక్కరోజే మద్యం సేవించి వాహనాలు నడిపిన 553 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరికి 5 రోజుల జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.6,38,500 జరిమానా విధించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమనిహెచ్చరించారు
HNK: రాష్ట్ర వికలాంగుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా కాజీపేటకు చెందిన ఇప్ప శ్రీకాంత్‌ను నియమించినట్లు సంఘం రాష్ట్ర నాయకులు అజీమ్ తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
MBNR: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా అధికారులతో నిర్వహించిన సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలిచ్చారు. అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు.
BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో TDP ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన సెంటర్‌లోని పార్టీ దిమ్మె వద్ద మండల అధ్యక్షుడు వారాది సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. 44 ఏళ్లుగా పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం టీడీపీ ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని అన్నారు.
NZB: పోతంగల్ మండలం కల్లూరులో ఆదివారం ఓ పిచ్చి కుక్క కరిచి నలుగురిని గాయపరిచింది. కల్లూరులో ఓ పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన మంగ, సాయవ్వ, విగ్నేశ్వర్, గంగాధర్‌ను స్థానికులు పోతంగల్ 108 అంబులెన్స్‌లో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రథమ చికిత్స చేసిన పోతంగల్ ఈఎంటి నవీన్, పైలెట్ కలీంలను వైద్యులు, గ్రామస్థులు అభినందించారు.
WNP: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడిన యువకుడికి కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల వివరాలు.. పానల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన అమ్మాయిని, అదే గ్రామానికి చెందిన నవీన్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పానగల్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించారు.
ASF: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రుల అండదండలతోనే అక్రమ మైనింగ్ సాగుతుందని ఆరోపించారు.
SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం దాతలు అందజేసిన 12 బారికేడ్లు చేరుకున్నాయని సిబ్బంది ఆదివారం తెలిపారు. త్వరలోనే నల్ల పోచమ్మ ఏడు వారాల మహా జాతర జరగనుంది. ప్రతి గురు, ఆదివారాల్లో వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడక్కడ ఈ భారీకేడ్లు ఏర్పాటు చేస్తామని సిబ్బంది చెప్పారు.
SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుట్టపై ఉన్న పెద్ద రాతిబండపై వెలసిన కాలభైరవ స్వామి సన్నిధిలో హరిబాబు రేకుల షెడ్డు నిర్మించారు. కాలభైరవ స్వామి పునర్నిర్మాణం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, ఒగ్గు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
BDK: అశ్వరావుపేట మండలం గంగారం చెరువులో వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై యాయతి రాజు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తి గతంలో వేదాంతపురంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతూ కనిపించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. మృతుడు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడని, కుడి చేతిపై ‘గోపాలస్వామి’ అని పచ్చబొట్టు ఉందని వివరించారు.
MDCL: మల్లాపూర్ డివిజన్‌లో గ్రీన్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. కాలనీల అభివృద్ధిలో వెల్ఫేర్ సంఘాల పాత్ర కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
MHBD: డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో ఆదివారం సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ డిఎస్ కళావతి- జగదీష్ ఆధ్వర్యంలో మొత్తం 8మంది లబ్ధిదారులకు సుమారు రూ.3.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోపరుచుకోవాలని సర్పంచ్ కోరారు. నిరుపేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందన్నారు.
GDWL: వేసవి ఉష్ణోగ్రతలను దృష్ట్యా నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాఘవ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న మొక్కలకు స్వయంగా నీళ్లు ఇచ్చారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలని, పశువుల కోసం గ్రామాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.