MULG: వెంకటాపురం మండలం వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గంటోజు సుగుణ, కడారి శ్రీలత అనే ఇద్దరు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.