WGL: వరంగల్ నగరంలో తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం తమ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు వరంగల్ MRO శ్రీకాంత్‌కు వినతి పత్రం అందజేశారు.