MLG: రిలయన్స్ ఫౌండేషన్ జాతీయ మెరిట్ స్కాలర్షిప్ 2025-26కు ములుగు దుర్గానగర్‌కు చెందిన సుతారి ఇంద్రనీల్ ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున మొత్తం రూ. 2 లక్షలు స్కాలర్షిప్ అందనుంది. డా. సుతారి సతీష్-స్వప్నల కుమారుడైన ఇంద్రనీల్‌ను పలువురు అభినందించారు.