NRPT: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పారాక్వాట్ కలుపు మందును రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ తెలిపారు. G.O.No.24 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఈ మందు నిల్వ, విక్రయం, రవాణా, వినియోగం అన్నీ చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. పారాక్వాట్ అత్యంత ప్రమాదకర రసాయనం కావడంతో ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని వెల్లడించారు.