MNCL: క్యాతన్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు మంత్రి వివేక్ సహకరించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. శుక్రవారం మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని, మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు తమకే ఉందని స్పష్టం చేశారు. ఓటరు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అనవసరంగా గొడవలు సృష్టించవద్దని హితవు పలికారు. ఛైర్మన్ పదవి తమకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.