NZB: జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కోసం ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.