NZB: నవీపేట్ మండలంలోని కోస్లీ గ్రామంలో మంగళవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. తమకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.