SRPT: పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈనెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య బృందం ఆధ్వర్యంలో కోదాడలో ఈ ప్రక్రియ జరగనుంది.