BDK: బూర్గంపాడు మార్కెట్ యార్డును మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి ధాన్యం కొనుగోలు, తూకం, చెల్లింపుల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక రైతులు తమ సమస్యలు వివరించారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులు పరిశీలించి తగు సూచనలు చేశారు.